
కొండాపూర్, వెలుగు: భూ సమస్య లేని మండలంగా కొండాపూర్ను తీర్చిదిద్దాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్క్రాంతి అన్నారు. సోమవారం మండలంలోని తొగరపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండాపూర్మండలాన్ని పైలట్ప్రాజెక్ట్కింద ఎంపిక చేసినందున మండలంలోని వివిధ గ్రామల ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన ఏ సమస్యలున్నా హెల్ప్డెస్క్ల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని అధికారులు, సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారన్నారు. రైతులు భూభారతి చట్టంలోని నియమాలన్నిటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి దరఖాస్తుకు రసీదు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్అశోక్, రైతు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి 55 దరఖాస్తులు
సంగారెడ్డి టౌన్: సమస్యలను పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి 55 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో పద్మజా రాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.