ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి

ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి

ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం 2024, జూన్ 11వ తేదీ మంగళవారం ప్రయాణికుడు రాజలింగం, రామాయంపేట వెళ్లడానికి ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామయంపేట్ వెళ్తుండగా ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సు ను ఆపాడు. 

అయితే.. బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు రాజలింగం తిట్టాడు. ఈ క్రమంలో ఆవేశంతో డ్రైవర్ బస్సును పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో దాడి చేశాడు. దీంతో ప్రయాణికుడి తలపై తీవ్ర గాయం అయ్యింది. ఈ ఘటనపై ప్రయాణికుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి పోలీసులు.. గాయపడిన ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.