ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

శబరిమలకు పాదయాత్ర

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు వెళ్తున్న స్వాముల పాదయాత్రను స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణం కోసం శబరిమలకు పాదయాత్ర నిర్వహించడం సంతోషకరమన్నారు. స్వాములకు తనవంతుగా రూ.2 లక్షలు ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అయ్యప్ప ఆలయం సమీపంలో రూ.15 లక్షలతో నిర్మించిన స్నానపు గదులను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గురుస్వామి వినయ్, టీఆర్ఎస్ నియోజకవర్గ నేత పోచారం సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ముదిరెడ్డి విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్టీవో రాజాగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు పాదయాత్రలో పాల్గొనే స్వాములను నాచారం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి 
ఆశీర్వదించారు.  

వసతుల్లేకుండా పర్మిషన్లు ఎట్లా ఇస్తారు?

డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కనీస వసతుల్లేని బీఎడ్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం సిగ్గుచేటని టీజీవీపీ జిల్లా ప్రెసిడెంట్​కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.  రూల్స్ పాటించని కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రిజిస్ట్రార్ విద్యావర్ధినికి మెమోరాండం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫీసర్లు బీఎడ్ కాలేజీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని సాయి బీఎడ్ కాలేజీ ఎన్సీటీఈ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా స్కూల్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నడుపుతున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు తనిఖీలు చేయకుండా కాలేజీలకు పర్మిషన్లు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో లీడర్లు అనిరుద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అన్వేష్, జీవన్ పాల్గొన్నారు.

హాస్టళ్లలో అడ్మిషన్లు పెంచాలి

కామారెడ్డి, వెలుగు: సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో స్టూడెంట్ల ప్రవేశాలు పెంచాలని, అర్హులైన వారు ఉంటే వారిని గుర్తించి హాస్టళ్లలో చేర్పించాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ యోగిత రాణా పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లాలో ఆమె పర్యటించారు. జిల్లా కేంద్రంలోని గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, రామారెడ్డి మండలం ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయి బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె విజిట్ చేశారు. స్టూడెంట్లతో మాట్లాడి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. కిచెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాస్టల్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లకు సమీపంలోని ఎస్సీ నివాసాల్లో ఏవరైనా స్టూడెంట్లు ఉంటే వారిని గుర్తించి చేర్పించాలన్నారు. గవర్నమెంట్​స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్ల స్కాలర్​షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఈనెల 30లోగా అప్లయ్​చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంకితభావంతో పని చేసే వెల్ఫేర్​ఆఫీసర్లను గుర్తించి నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రజిత ఉన్నారు. 

జిల్లాలో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ దాడులు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బుధవారం టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. సీపీ కె.ఆర్ నాగరాజు ఉత్తర్వుల మేరకు రైడ్స్‌‌‌‌ చేపట్టినట్టు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లిలో కొందరు వ్యక్తులు అక్రమంగా స్నూకర్ నిర్వహిస్తున్నారని తెలియడంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో షాకీర్, కరీం, షోహెబ్ అలాం, ఫవాజ్ బాహతాబ్, మిర్జా మోసిన్, అబ్దుల్ నజీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అరెస్టు చేసి ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు. బిల్డింగ్ ఓనర్ మహమ్మద్ నయీం పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 66 స్నూకర్ బాల్స్,16 క్యూ స్టిక్స్, ఏడు సెల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్, నాలుగు ప్లేయింగ్ టేబుల్స్, రెస్ట్ స్టిక్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరంపై..

నవీపేట్ మండలం నాలేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.48,550 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. పేకాడుతున్న దొండే వెంకటేశ్, ఆర్మూర్ చిన్నయ్య, వకే రాజశేఖర్, దివేడి సుభాష్ రావు, షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబును అరెస్టు చేసి నవీపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు అప్పగించారు.

మొరం తరలిస్తున్న పలువురు అరెస్ట్

మాక్లూర్ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని మాణిక్ బండారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశారు. ఐదుగురితో పాటు ఐదు టిప్పర్లు పట్టుకున్నారు. అరెస్టు చేసిన ర్యాపని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంపంగి గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓల్లేపు మల్లేశ్, తమ్మిషెట్టి వెంకటేశ్, బోగిని రాజులను మాక్లూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పగించారు.

కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

లింగంపేట, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని కామారెడ్డి డీసీవో వసంత ఆఫీసర్లకు సూచించారు. మండలంలోని మెంగారం, బోనాల్, అయ్యపల్లి శెట్పల్లి గ్రామాల్లోని వడ్లకొనుగోలు కేంద్రాలను కోఆపరేటివ్ మానిటరింగ్ ఆఫీసర్ నర్సింహులుతో కలిసి బుధవారం ఆమె సెంటర్లను పరిశీలించారు. కేంద్రాల్లో సరైన విద్యుత్​లైట్లు అమర్చకపోవడం వల్ల రాత్రి వేళల్లో రైతులు కల్లాల వద్ద భయం భయంగా గడుపుతున్నారని, అడవి పందులు వడ్ల కుప్పలను ధ్వంసం చేస్తున్నాయని విండో వైస్ చైర్మన్​ మాకం రాములు ఫిర్యాదు చేయడంతో పరిశీలనకు వచ్చినట్లు డీసీవో వసంత చెప్పారు. కేంద్రాల్లో వెంటనే లైట్లను ఏర్పాటు చేయాలని విండో సీఈవో సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. రైతులు వడ్ల కుప్పల వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  మిల్లుల యజమానులతో చర్చలు జరిపి త్వరలోనే వడ్ల కొనుగోళ్లను షురూ చేస్తామని చెప్పారు.  

బీడీ పరిశ్రమను కాపాడుదాం..

నిజామాబాద్ టౌన్, వెలుగు: బీడీ పరిశ్రమను కాపాడుకునేందుకు సంఘటితంగా పోరాడాలని సీపీఐ (ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు  పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాలుగో మహాసభకు ఆయన చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ రంగాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మోడీ బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ప్రకటిస్తూ కార్మికులకు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, మోహన్, నవీన్, సావిత్రి, పద్మ, విమల, టేకేదార్లు, కార్మికులు పాల్గొన్నారు.

కడ్తా తీస్తే మిల్లులు సీజ్ చేస్తాం

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్, వెలుగు:  నాణ్యమైన వడ్లలో తరుగు, కోత విధిస్తే రైస్ మిల్లులు సీజ్ చేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని బోర్గాం (పీ), మోపాల్, నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ తండా, బాడ్సి గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషిన్లు  అందుబాటులో ఉంచాలన్నారు. హమాలీలను అధిక సంఖ్యలో నియమించి లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన అన్నదాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా చూడాలన్నారు. రైతులు కూడా ఆరబెట్టి వడ్లను కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలన్నారు. కలెక్టర్ వెంట డీసీవో సింహాచలం, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో చంద్రప్రకాశ్, మోపాల్ తహసీల్దార్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, ఎంపీడీవో లింగం ఉన్నారు.

మన బస్తీ.. మన బడి పనుల పరిశీలన

ఆర్మూర్, వెలుగు: పట్టణంలో ‘మన బస్తీ.. మన బడి’లో  భాగంగా చేపట్టిన పనులను అడిషనల్​కలెక్టర్ చిత్రా మిశ్రా బుధవారం పరిశీలించారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నవనాథపురం, మామిడిపల్లి,పెర్కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రైమరీ స్కూళ్లలో చేపట్టిన నిర్మాణం పనులను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మున్సిపల్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన్పటికీ పనులు పూర్తి చేయించకపోవడం ఏమిటని కమిషనర్​ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​, డీఈ భూమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయంచాలని ఆదేశించారు. ఎంఈవో పింజ రాజగంగారం, ఏఈ రఘు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు విజయలక్ష్మి, అనసూయ, చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డడ్డి 
పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన గురుకుల స్టూడెంట్ 

డిచ్​పల్లి, వెలుగు: మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల స్టూడెంట్అక్కపెల్లి వసుంధర ఎంబీబీఎస్ ​సీటు సాధించినట్లు ప్రిన్సిపాల్ సంగీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె చదువు కోసం రెడ్డి ట్రస్ట్​ తరఫున పైపుల రాజారెడ్డి రూ.25 వేలు, లాలాన ఫౌండేషన్​వారు రూ.25 వేలు అందజేశారని చెప్పారు. జగిత్యాలకు చెందిన రాజేశ్వర్ హాస్టల్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇందుకు సహకరించిన జిల్లా కోర్ట్ సెక్రటరీ పద్మావతి, జిల్లా ప్రధాన జడ్జి సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ శ్రేణుల నిరసన

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీఆర్ఎస్ లీడర్లు చేసిన దాడిని నిరసిస్తూ బుధవారం ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాదాపు అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఓటమి  భయంతోనే అధికార పార్టీ లీడర్లు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని లేకుంటే ప్రజలు తగిన
 గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.