- ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ, వెలుగు : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ కల్కి చెరువులో ఎమ్మెల్యే ఉచిత చేప పిల్లలను వదిలి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉచితంగా చేపపిల్లలు అందజేయడంతోపాటు చేపల వేటకు సామగ్రి, వాహనాలు అందజేస్తుందన్నారు.
మార్కెటింగ్‌కు అన్ని విధాల సర్కార్ సహకారమందిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా మత్స్య శాఖ అధికారి, పి. శ్రీపతి, మత్స్య అభివృద్ధి అధికారి, నిజాంసాగర్ కె.డోలిసింగ్, మత్స్య క్షేత్ర అధికారి ఎ.ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
