- డీఎస్పీ మధుసూదన్
ఆర్మూర్, వెలుగు : భీమన్న ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది చేపూర్ గ్రామంలో మీనుగు అమ్మన్న పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లాస్థాయి ఆదివాసీనాయకపోడ్ కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీఎస్పీ మధుసూదన్ అన్నారు. బుధవారం చేపూర్ లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను డీఎస్పీ, డిప్యూటీ సీఈవో సాయన్న తో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు ఆదివాసీ నాయకపోడ్ కుల సభ్యులు ఘనంగా భీమన్న దేవుని కల్యాణం నిర్వహించి అగ్గిగుండాన్ని కుటుంబ సభ్యులతో దున్నడం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కోసెడుగు రవి, కాంగ్రెస్మండల ప్రెసిడెంట్ ఎస్కె.చిన్నా రెడ్డి, సారంగి నడ్పి సాందన్న, గంగాధర్, సత్యనారాయణ, గంగారెడ్డి, ఇందుర్ సాయన్న, జన్నెపల్లి గంగాధర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
