పటిష్ట పాక్పై పసికూన థాయిలాండ్ ఘన విజయం

పటిష్ట పాక్పై పసికూన థాయిలాండ్ ఘన విజయం

ఉమెన్స్ ఆసియాకప్ లో సంచలన విజయం నమోదైంది. పటిష్ట జట్టుగా పేరొందిన పాకిస్థాన్ మహిళల జట్టు..అనామక టీమ్..థాయిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను థాయిలాండ్ ఓడించింది. మహిళల క్రికెట్‌లో థాయ్‌లాండ్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

సిద్రా అమీన్ మాత్రమే..
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళల జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 116 పరుగులు చేసింది. సిద్రా అమీన్ 64 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేయగా... మిగతవారు దారుణంగా విఫలమయ్యారు.  థాయ్‌లాండ్ బౌలర్లలో సోర్నారిన్ రెండు వికెట్లు తీయగా.. తిపట్చా ఓ వికెట్ పడగొట్టింది. 

హాఫ్ సెంచరీతో విజయంలో కీ రోల్..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్ ఉమెన్స్...19.5 ఓవర్లలో 6 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నత్తకన్ చంతమ్ 61 హాఫ్ సెంచరీ చేసింది. పాక్ బౌలర్లలో నిదా దర్, టుబా హస్సన్ రెండేసి వికెట్లు తీసింది. నష్రా సంధు, కైనత్ ఇమ్తియాజ్ తలో వికెట్ పడగొట్టింది.