Thamma Trailer: 'థామా' ట్రైలర్ రిలీజ్: రక్త పిశాచుల ప్రపంచంలో రష్మిక రొమాన్స్ ..!

Thamma Trailer: 'థామా' ట్రైలర్ రిలీజ్: రక్త పిశాచుల ప్రపంచంలో రష్మిక రొమాన్స్ ..!

హారర్, కామెడీ, థ్రిల్‌తో ఆకట్టుకోబోతున్న చిత్రం 'థామా' (Thamma). బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హిందీలో విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

రక్త పిశాచుల ప్రపంచంలో రొమాన్స్!

దర్శకుడు ఆదిత్యా సర్పోత్దార్ ఈ చిత్రాన్ని హారర్ కామెడీగా అద్భుతంగా రూపొందించారు. కేవలం హారర్ అంశాలే కాకుండా, ఈ కథలో ప్రేమకు చావు ఉండదనే అంశాన్ని కూడా ప్రధానంగా చూపించారు. ఈ సినిమాలో ఒక కొత్తరకమైన కథాంశం ఉంది. దీనిలో రక్త పిశాచుల (Vampirism) మూలాలను అన్వేషించే ఒక చరిత్రకారుడిగా ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నారు.

ట్రైలర్‌లో... రష్మిక ఒక మిస్టీరియస్ యువతిగా కనిపిస్తుంది. ఆమె , ఆయుష్మాన్ మధ్య సాగే అంతుచిక్కని ప్రేమకథే ఈ సినిమా ప్రధానాంశం.  ఇప్పటికే హిందీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈరోజు ( సోమవారం ) తెలుగు ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

నువ్వు నా సొంతమా..

అంతే కాదు ఈ సినిమా నుంచి  విడుదలైన ప్రేమ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు విడుదలైన వీడియోల్లో రష్మిక సీరియస్ లుక్‌లో కనిపించినప్పటికీ, ఈ పాటలో మాత్రం తన గ్లామర్, అందంతో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. "కొన్ని ప్రేమ కథలకు ఎప్పటికీ మరణం ఉండదు" అంటూ ఈ వీడియో సాంగ్‌ను పంచుకున్న చిత్ర బృందం, ఈ ప్రేమకథ రెండు వేర్వేరు సమయాల్లో జరుగుతుందని హింట్ ఇచ్చింది.

చరిత్ర, పురాణాలు, భయానక అంశాలు, హాస్యం కలగలిసిన 'థామా' ఈ దీపావళికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 'గర్ల్ ఫ్రెండ్', 'కాక్‌టెయిల్ 2 ',  వంటి పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న, ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు చూస్తోంది. అక్టోబర్ 21న థియేటర్లలో ఈ హారర్ కామెడీతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.