
ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు విక్రమ్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘తంగలాన్’ ఒకటి. పా రంజిత్ డైరెక్షన్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. సోమవారం పొంగల్ విషెస్ తెలియజేసిన టీమ్.. ఈ మూవీ కొత్త రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
వాస్తవానికి ఈ సినిమాను ఈ నెల 26న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వలన మరో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.