
‘థాంక్యూ దిల్ సే’లో ఫాదర్స్ డే (జూన్ 19) సందర్భంగా స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. శ్రీముఖి, సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో సెలబ్రిటీలు తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. ఈ వారం టెలికాస్ట్ అవనున్న ఈ స్పెషల్ షో టీజర్ వచ్చింది. అందులో హీరో రానా తండ్రి సురేష్ బాబు, బిగ్బాస్ ఫేమ్ సోహైల్ తండ్రి సలీం సయ్యద్ గెస్ట్లుగా వచ్చారు. హీరోయిన్ సాయిపల్లవి, రాశీ ఖన్నా, హీరో గోపిచంద్, ఆకాశ్ పూరీ, కిరణ్ అబ్బవరం కూడా గెస్ట్లుగా వచ్చారు. అంతేకాదు రాజీవ్ కనకాలకు ఆయన తండ్రి దేవదాస్ కనకాల విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు నిర్వాహకులు. ‘‘నాన్న హీరో.. మనకు నచ్చినప్పుడు. నాన్న జీరో... మనకు నచ్చనప్పుడు’’ అని నాన్న గురించి శుభలేఖ సుధాకర్ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఈ షో జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.