
న్యూఢిల్లీ: క్రికెట్‌కు తాను చేసిన సేవలను గుర్తిస్తూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పొగడ్తలకు ఎంతో పొంగిపోయానని ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రధాని నుంచి ఇలాంటి ఆత్మీయ ప్రోత్సాహం అందుకోవడం చాలా గౌరవంగా, గర్వంగా ఉందని చెప్పింది. ‘నాతో సహా ఎంతో మందికి మోడీ స్ఫూర్తిగా నిలిచారు. ప్రధాని కామెంట్లను ఎప్పటికీ విలువైనవిగా పరిగణిస్తా. ఆ మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. ఇండియన్ స్పోర్ట్స్ అభివృద్ధికి కోసం ప్రధానమంత్రి అంచనాలకు అనుగుణంగా పని చేసేందుకు కృషి చేస్తా’ అని మిథాలీ ట్వీట్ చేసింది.