
- డీఎస్పీ స్థాయి పోస్ట్ ఇవ్వడం సంతోషంగా ఉంది
శంషాబాద్, వెలుగు: పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొని ఇండియాకు తిరిగొచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. సోమవారం సాయంత్రం ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం నిఖత్ జరీన్ మీడియాతో మాట్లాడారు. ఇండియా తరఫున ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం రావడం గర్వంగా ఉందని తెలిపారు. ఓటమి నిరాశ కలిగించిందని దాని నుంచి పాఠాలు నేర్చుకుని విజయం వైపు అడుగులు వేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ స్థాయి పోస్టులో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఒలింపిక్స్ లో బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న నిఖత్ జరీన్ చైనా బాక్సర్ చేతిలో పరాజయం పాలయ్యారు.