
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్.. బెస్టాఫ్ త్రీగా ఉండాలన్నది కోహ్లీ అభిప్రాయం మాత్రమేనని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఫార్మాట్‌ను ఛేంజ్ చేయాలని తను ఎప్పుడూ డిమాండ్ చేయలేదన్నాడు. అయితే కొంత మంది విశ్లేషకులు విరాట్వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. ‘బెస్టాఫ్ త్రీ ఉంటే బెస్ట్ టీమ్‌ను సెలెక్ట్ చేయొచ్చన్నది కోహ్లీ అభిప్రాయం. మూడు మ్యాచ్‌లు ఉండటం ద్వారా కండీషన్స్‌కు అలవాటు పడటంతో పాటు పుంజుకోవడానికి చాన్స్ ఉంటుందని చెప్పాడు. అంతేగానీ బెస్టాఫ్ త్రీ ఉండాలని తను డిమాండ్ చేయలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంకా టైమ్ ఉండటంతో.. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు బ్రేక్ ఇచ్చారు. ఇలాంటి బ్రేక్ ప్లేయర్లకు చాలా మంచిదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘మేం చాలా రోజుల నుంచి బబుల్‌లోనే గడుపుతున్నాం. ఇప్పుడే కొద్దిగా బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం. ఇలాంటి బ్రేక్ మాకు చాలా అవసరం. ఎందుకంటే దీనివల్ల ప్లేయర్లందరూ మళ్లీ ఉత్సాహంగా తయారవుతారు. ఫలితంగా మంచి క్రికెట్ ఆడే చాన్స్ లభిస్తుంది’ అని రవిచంద్రన్ వ్యాఖ్యానించాడు.