ఆ తల్లి పాలు బిడ్డకు ప్రమాదం

ఆ తల్లి పాలు బిడ్డకు ప్రమాదం

ఆమె యూకేలో ఉంటోంది. ఎందుకో ఆ రోజు ఆఫీసు నుం చి ఇంటికి త్వరగా బయలుదేరింది. డే కేర్​కి వెళ్లి తన బిడ్డను తీసుకెళ్లాలనుకుంది. డే కేర్​ సెంటర్ తలుపు కొట్టకుండా నేరుగా వెళ్లే దారి ఒకటి ఉంది. ఆ దారి నుం చి పాప దగ్గరకు వెళ్లిం ది. పాపను చూసి ఒక్కసారి గా కంగుతిన్నది. దానికి కారణం పాపకు అక్కడున్న కేర్​ టేకర్​ పాపకు చనుబాలు పడుతోంది కోపమో… భయమో తెలియదు కానీ ఆ తల్లి గట్టిగా అరిచింది. వెంటనే పాపను లాక్కు ని, బేబీ బ్యాగ్ ని చేతికేసుకుని బయలుదేరింది. ఆ రోజు రాత్రి ఏమీ తినకుండా, నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది. అలా అసలు వేరే తల్లి పాలు పట్టడం మంచిదేనా? దానివల్ల నా బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తాయా? ప్రాణాలకేమైనా ప్రమాదమా? ఈ విషయాన్ని డేకేర్​ యాజమాన్యానికి చెప్పి గట్టిగా అడగాలా? మిగతా పేరెంట్స్ కి ఈ విషయం చెప్పాలా లాంటి ఆలోచనలతో బిడ్డను ఒళ్లోపెట్టు కుని ఏడుస్తూనే ఉంది. ఉదయమే పాపని తీసుకుని డే కేర్ కు​ బయలుదేరాలనుకుంది. ఆ కేర్​ టేకర్, ఓనర్​ని కడిగి పారేయాలనుకుంది. అలా చేస్తే, విషయం నాలుగు గోడల మధ్యే ఉంటుంది. కానీ, ఆమె నలుగురికీ తెలిసేలా చేయాలనుకుంది.

నేను సింగి ల్ మదర్​ని. ఉద్యోగం చేయాల్సిందే. అలా చేస్తూ పాపను సాకాలంటే నాకు వేరే దారిలేదు. అందుకే డబ్బాపాలు తాగిస్తూ డే కేర్​లో వేశాను. నా పాపకు చనుబాలు పడుతున్న కేర్​ టేకర్​కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ వాళ్లతో పాటు నా పాపకు కూడా పాలు పడుతుందని అసలు అనుకోలేదు. ఇలా రోజూ చేస్తోందట. నేను చూశాను కాబట్టి తెలిసింది. లేకపోతే వాళ్లు అసలు చెప్పేవాళ్లు కాదు. దానివల్ల నా పాపకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యులు? అని జరిగిన సంఘటనను ఒక మీడియా సంస్థకు వివరంగా తెలిపింది. వాళ్లు ఆ వార్తను ప్రచురించారు. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అలా పాలు పట్టడం కరెక్టేనా…?

ఒకప్పుడు పల్లెటూళ్లలో ఒకరి బిడ్డకు మరొకరు పాలు పట్టేవాళ్లు. బిడ్డ పుట్టగానే తల్లికి పాలు పడకపోతే, అవి పడేవరకు పక్కనున్న బాలింతలు పాలిచ్చేవాళ్లు. కానీ అది ప్రస్తుతం ఆరోగ్యకరం కాదంటున్నారు డాక్టర్లు. దానివల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చేఅవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. హెచ్ఐవీ, హెపటైటిస్​ వంటి ఆరోగ్య సమస్యలు ఆ పాలిచ్చేతల్లిలో ఉంటే, పాల ద్వారా అవి పిల్లలకూ రావొచ్చంటున్నారు.