ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే

ఉదయనిధి స్టాలిన్  మరోసారి సంచలన వ్యాఖ్యలు.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే

సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ గవర్నర్ చెప్పిందే మేం కూడా చెబుతున్నాం.. అందుకే ముందు సనాతన  ధర్మాన్ని నిర్మూలించాలని చెబుతున్నాం.. కుల వివక్ష గురించి మాట్లాడుతున్నాం.. పుట్టుకతో అందరూ సమానమే అని చెబుతున్నాం.. ఎక్కడ కులవివక్ష ఉన్నా అది తప్పే.. దానికి వ్యతిరేకంగా మేం గళం విప్పుతాం ’ అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

ALSO READ: మహిళా అర్చకులకు అభినందనలు తెలిపిన ఉదయనిధి స్టాలిన్ 

ఆదివారం తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవి మాట్లాడుతూ.. తమిళనాడులో సామాజిక వివక్ష ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద సమస్య .. ఇది ఆమోద యోగం కాదు.. పెద్ద సంఖ్యలో సోదర సోదీరీమణులు వివక్షకు గురి అవుతున్నారు.. ఇది బాధాకరం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. 
గవర్నర్ రవి వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్..  ఇదే విషయాన్ని మేం కూడా ముందే చెప్పాం.. సనాతన ధర్మం నిర్మూలిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. 

ఇటీవల ఉదయనిధి స్టాలిన్  సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు బహుమతి ఇస్తామని ఉత్తరప్రదేశ్ సన్యాసి ప్రకటించడం.. ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా ప్రతి పక్షపార్టీలు, ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. 

సనాతన ధర్మం వ్యతిరేకించేవారికి ధీటుగా స్పందించాలని ప్రధాని మోదీ పిలుపు నివ్వడం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది. జి20 సమావేశాలు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సనాతన ధర్మం వివాదం కొద్దిగా సద్దు మణిగినా..  తాజా తమిళనాడు గవర్నర్ రవి  నిన్న తంజావురులో చేసిన  వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.