
ముషీరాబాద్, వెలుగు : ఎన్టీఆర్ స్టేడియంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్(పుస్తక ప్రదర్శన) గురువారం నుంచి మొదలు కానుంది. జనవరి 1 వరకు 11రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో 300కు పైగా స్టాల్స్ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఢిల్లీ, కోల్కతా, మహారాష్ట్ర, కర్నాటకల్లోని పబ్లిషర్లు ఇక్కడ స్టాల్స్ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30వరకు బుక్ ఫెయిర్కొనసాగుతుందని, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.