
రూ. 3.75 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా
న్యూఢిల్లీ: ఈ నెల 4 నుంచి వచ్చే నెల 14 మధ్య దేశంలో సుమారు 32 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కైట్) అంచనావేసింది. ఈ పెళ్లిళ్ల వలన రూ.3.75 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని పేర్కొంది. 35 సిటీల్లోని 4,302 మంది ట్రేడర్ల నుంచి అభిప్రాయాలను సేకరించి ఓ రిపోర్ట్‌ను కైట్ విడుదల చేసింది. ఒక్క ఢిల్లీలోనే ఈ ఏడాది నవంబర్ 4–డిసెంబర్ 14 మధ్య 3.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, దీంతో సుమారు రూ.75 వేల కోట్ల బిజినెస్ క్రియేట్ అవుతుందని కైట్ పేర్కొంది. కిందటేడాది ఇదే టైమ్‌లో దేశంలో 25 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, రూ.3 లక్షల కోట్ల బిజినెస్ అయ్యిందని వివరించింది.