ఫ్యాషన్‌కి చిరునామాగా 91 ఏళ్ల బామ్మ

ఫ్యాషన్‌కి చిరునామాగా 91 ఏళ్ల బామ్మ

చదువు, లవ్వు, జాబుకు వయసుతో పనేందని ఇదివరకే ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడీ 91 ఏళ్ల భామ ఫ్యాషన్‌కూ వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. నెట్టింటి జనాన్ని ఇన్పైర్​ చేస్తోంది. హెలెన్ రూథ్ ఎలామ్ అనే బామ్మ ఫ్యాషన్ ప్రపంచానికే ఐకాన్‌గా నిలుస్తోందంటే అతిశయోక్తి కాదేమో. యువతరానికి ఏమాత్రం తీసిపోకుండా తన ఫ్యాషన్ అందాలను చూపిస్తోంది. 85 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారిగా ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. అయితే, తన ఫ్యాషన్‌కు కారణం తన మనవరాలేనని ఆమె అంటారు. తొలిసారిగా ఆమె మనవరాలే ట్విట్టర్​లో హెలెన్ ఫొటోను పోస్ట్​ చేయడంతో అప్పట్నుం చి ఆమె నెట్టింట్లో ఓ సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ బామ్మ ‘బ్యాడీవింకిల్ ’ పేరిట ఇన్‌స్టాగ్రా‌మ్ అకౌంట్ కూడా నడుపుతోంది. అందులో తన ఫ్యాషన్ ఫొటోలన్నింటినీ పోస్ట్​ చేస్తుంటారు . 38 లక్షల మందికిపైగా ఆమెను ఫాలో అవుతున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఫేమస్ పాప్ సింగర్లూ ఆమెను ఫాలో అవుతున్నారు. సైరస్‌‌‌‌ మైలీ వంటి ప్రముఖులు ఆమెను ఫాలో అవుతున్న వాళ్లలో ఉన్నారు.

For More News..

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ