సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. డిసెంబర్​1న సెస్ కు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా 5 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామాలు, మండలాలవారీగా ఓటర్ల లిస్ట్ ను ప్రకటించారు. సెస్ పరిధిలో 87,130 మంది ఓటర్లు ఉన్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండంటో సెస్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నయ్యారు. జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి 15 మంది డైరెక్టర్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు ఎన్నికల అధికారి మమత నేటి నుంచి అందుబాటులో ఉంటారని డీసీఓ బుద్ధనాయుడు తెలిపారు. 

అంతా గోప్యం.. అయోమయం

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ఓటర్లను లిస్టవుట్ చేయలేదు. గ్రామాలు, మండలాలవారీగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా ఓటర్లను డివైడ్ చేయలేదు. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఆయోమయానికి గురవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆఫీసర్లు సరైన సమాచారం ఇవ్వకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. 

కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

సెస్ ఎన్నికల రిజర్వేషన్లను సవాలు చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయిపల్లి మండలం విలాసాగర్ కు చెందిన బీజేపీ లీడర్ ఏనుగుల కనకయ్య సెస్ రిజర్వేషన్ల ప్రక్రియ అసంబద్ధంగా ఉందంటూ కోర్టు తలుపు తట్టాడు. దీంతో హైకోర్టు కనకయ్య పిటిషన్ ను విచారణ కు స్వీకరిచింది. నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. గతంలో సెస్ కు ఎన్నికలు నిర్వహించకుండానే మంత్రి కేటీఆర్ గుడూరి ప్రవీణ్ ను పర్సన్ ఇన్​చార్జిగా,​ 14 మందిని డైరెక్టర్లను నియమిస్తూ 2022 ఏప్రిల్ 18న జీఓ జారీ చేశారు. అయితే ఈ జీఓ ను సవాలు చేస్తూ  కనకయ్య హై కోర్టును  ఆశ్రయించారు.  దీంతో సెస్ కు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆగస్టు 25న తీర్పు వెలువరించింది.

అభ్యర్థులపై పార్టీల కసరత్తు..

సెస్ ఎన్నికల్లో తమ క్యాండెట్లను బరిలోకి దించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మంత్రి కేటీఆర్ సోమవారం టీఆర్ఎస్ ఆశావాహులను తన క్యాంపు ఆఫీస్​కు రప్పించుకుని మంతనాలు జరిపారు. మంగళవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమచారం. పక్కా వ్యూహంతో వ్యవహరించి సెస్ చైర్మన్ గిరి దక్కించుకునేందుకు బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేలా కసరత్తు చేసినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కొన్ని మండలాలో తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. తమ ప్రాబల్యం ఉన్న మండలాలో బీఎస్పీ కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం అన్ని పార్టీలు సెస్ లో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు 
ప్రారంభించాయి.

టీఆర్ఎస్​అభ్యర్థులు..

సెస్ డైరెక్టర్ స్థానాలకు టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రకటించారు. సిరిసిల్ల నియోజకవర్గవర్గంలోని తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాలు మినహా అన్ని మండలాల అభ్యర్థులను ఆయన ప్రకటించారు. వేములవాడ, చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులను మగళవారం ప్రకటించనున్నారు.
1. సిరిసిల్ల–1–  దిడ్డి రమాదేవి శ్రీనివాస్  (బీసీ, పద్మశాలి)
2. సిరిసిల్ల – 2– దార్నం లక్ష్మీ నారాయణ  (బీసీ, పద్మశాలి) 
3. ముస్తాబాద్– సందుపట్ల అంజిరెడ్డి  (ఓసి, రెడ్డి)
4. ఎల్లారెడ్డిపేట– వర్స కృష్ణహరి (బీసీ, మున్నూరుకాపు)
5. వీర్నపల్లి – మాడ్గుల మల్లేశం  (బీసీ, యాదవ)