అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు

అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్య విద్యార్థుల ఆందోళనలు

వరంగల్ : వరంగల్ అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనలు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. రద్దు చేసిన 2022, 23  ఆయుష్  ఆయుర్వేద విద్య వైద్య సీట్లను వెంటనే పునరుద్దరించాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆయుర్వేద హాస్పిటల్ కు తాళం

రెండోరోజు ఆయుర్వేద హాస్పిటల్ కు తాళం వేసి, గేటు ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. అయితే.. ఉన్నతాధికారుల సూచన మేరకు హాస్పటల్ తాళాన్ని తీశారు. దీంతో యధావిధిగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. మరోవైపు హోమియో, ఆయుర్వేదిక్ అసిస్టెంట్ డైరెక్టర్లు లింగరాజు, పరశురాములు విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు. తమ డిమాండ్లను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

ఐదు రోజులుగా ధర్నాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజీలో సరైన వసతులు లేక అడ్మిషన్లు కూడా రద్దయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు లేఖ రాసినా స్పందించడం లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.