గాలి మంచిగ లేదు

గాలి మంచిగ లేదు

కొవిడ్​ వైరస్ ఎఫెక్ట్​తో లైఫ్​ స్టయిల్​లో అనేక మార్పులు జరిగాయి. తిండి విషయంలో మరీ జాగ్రత్తలు పడుతున్నారు. దాంతోపాటు పీల్చే గాలి విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు ఎక్స్​పర్ట్స్. ఆరు బయటిగాలి, గది లోపలి గాలి మధ్య తేడా ఉంటుంది. ఎక్కడైనా సరే గాలిద్వారా వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది. అందుకోసం ఇంట్లో, బయట గాలి ​ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గత కొంత కాలంగా వర్క్​ ఫ్రమ్​ హోం, ఆన్​లైన్​ క్లాస్​లని ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటున్నారు.  దాంతో మనం పీల్చి, వదిలే గాలి, ఇతర కారణాల వల్ల హానికర క్రిములు ఇంట్లో పెరిగే ప్రమాదం ఉంది. చాలారకాల క్రిములు నోటి ద్వారా, ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్తాయి. మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం వల్ల గాలిలో క్రిములు చేరతాయి. అందుకే ఇంట్లో గాలి శుభ్రంగా ఉంచాలి.  అందుకు చేయాల్సింది గదులకు మంచి వెంటిలేషన్ ఉండేలా చూడడం. మరోవైపు పొల్యూషన్​ వల్ల ఆరుబయట మనం పీల్చే గాలి కూడా అన్ని చోట్లా ఫ్రెష్​గా ఉండదు. సూర్యోదయానికి ముందు ​ వాతావరణంలో తాజాగాలి  ఉంటుంది. ఆ టైంలో ఇంటి డోర్లు, కిటికీలు తెరిచి ఉంచితే ఇంటిలోపలి గాలి ​ శుభ్రం అయ్యే ఛాన్స్​ ఉంటుంది.
ఎయిర్​ పొల్యూషన్​పై డబ్ల్యూహెచ్​ఓ..
గ్లోబల్​ ఎయిర్​ పొల్యూషన్​ రోజురోజుకూ ప్రమాదాన్ని పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లొకసారి చెప్పింది. దాని రిపోర్ట్​ ప్రకారం... ఏడాదికి 70లక్షల మంది గాలి పొల్యూషన్​ వల్ల చనిపోతున్నారు. గాలి కాలుష్యం అతిపెద్ద ప్రమాదం అని డబ్ల్యూహెచ్​ఓ అంటోంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే బయట గాలిలో పొల్యూషన్​ తగ్గించి, గాలి క్వాలిటీని పెంచాలి.  దీని ప్రభావం కేవలం ఏ ఒక్క దేశానికో, ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. అందుకే అందరూ కలిసి ఎయిర్​ పొల్యూషన్​ను అడ్డుకోవాలని చెప్పింది.