బుద్వేల్ లో ఎకరం రూ.30 కోట్లు.. కొనసాగుతున్న వేలం

బుద్వేల్ లో ఎకరం రూ.30 కోట్లు.. కొనసాగుతున్న వేలం

రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో ప్రభుత్వ భూముల వేలం దుమ్మురేపుతోంది. కోకాపేట అంత కాకపోయినా.. భారీ ధర పలుకుతోంది. ప్రభుత్వ ధర ఎకరం రూ.20 కోట్లుగా నిర్ణయిస్తే.. ఫస్ట్ సెషన్.. అంటే మధ్యాహ్నం వరకు జరిగిన వేలంలో ఎకరం అత్యధికంగా 30 కోట్ల రూపాయల వరకు ధర పలికింది. కనీస ధర రూ.25 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ధరను మించి 10 కోట్ల రూపాయలు అదనంగా వేలం జరగటం ఇక్కడ విశేషం.

కేసీఆర్ సర్కార్ వరుసగా భూములను అమ్ముతోంది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూములను వేలం వేస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్ లో (మార్నింగ్ సెషన్) భూముల వేలం పాట కొనసాగుతోంది. ఇక్కడ ఒక ఎకరానికి రూ.25 కోట్లు దాటి వేలం పాట నడుస్తోంది. అత్యధికంగా 5వ నెంబరు ఎకరం రూ.30 కోట్లు దాటింది. సెషన్ ముగిసే టైమ్ లో వేలం పాట ఊపందుకుంది. కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్లతో వేలం పాట ప్రారంభమైంది. కోకాపేట లో ఎగబడి కోడ్ చేసిన బిడ్డర్లు.. బుద్వేల్ లో మాత్రం కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడ భూముల రేట్లు అత్యధికంగా ఉండడమే కారణం. బుద్వేల్ లో .. బిడ్ పెంపులో ఎక్కువ ధర కోడ్ చేయడం లేదు.