వందేళ్ల ఇండస్ట్రీలో రేర్ రికార్డ్.. ఒక్కరోజులోనే రూ.140 కోట్లు ఖర్చు చేసిన ఆడియన్స్

వందేళ్ల ఇండస్ట్రీలో రేర్ రికార్డ్.. ఒక్కరోజులోనే రూ.140 కోట్లు ఖర్చు చేసిన ఆడియన్స్

కొరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ వ్యవస్థ అతలాకుతలం ఐన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు థియేటర్‌ అన్నీ జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ రేర్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. వందేళ్ల సినీ చరిత్రలో ఇప్పటివరకు చూడని ఈ రేంజ్ కెలెక్షన్స్ చూడలేదని స్వయంగా మల్టీప్లెక్స్‌ అసోసియేషన్సే చేపిస్తున్నాయి.

గత శుక్రవారం అంటే ఆగస్టు 11 నుండి ఆదివారం వరకు కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రెండు కోట్లకు పైగా టిక్కెట్‌లు తెగడం అంటే  అది మాములు విషయం కాదు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్స్ ఎగబడుతున్నారట. ఈ క్రమంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డు క్రియేట్‌ అయింది.

కేవలంమంగళవారం(ఆగస్టు 15) ఒక్కరోజే సినిమాలు చూడాడానికి ప్రేక్షకులు  అక్షరాలా రూ.140 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ లెక్కలు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సన్ని డియోల్‌ నటించిన గదర్‌-2 సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. మంగళవారం ఒక్కరోజే ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్‌ చేసిందట. ఆ తర్వాత స్థానంలో రూ.42 కోట్లతో రజనీకాంత్ నటించిన జైలర్‌ నిలవగా.. రూ.20 కోట్లతో ఓ మైగాడ్‌ మూడో స్థానంలో నిలిచింది. భోళా శంకర్‌, ఓపెన్‌ హైమర్‌, రాణీకి ప్రేమ్‌ కహాని, బార్బీ, మిషన్‌ ఇంపాజిబుల్‌-7, మెగ్ సినిమాలు కలుపుకొన్ని ఒక ఇండిపెండెన్స్‌ డే రోజునే రూ.140 కోట్ల వసూళ్లు వచ్చాయట. ఇది ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలోనే ఓ అరుదైన రికార్డు అని ట్రేడ్ అనలిస్టులు అభివర్ణిస్తున్నారు.