గడ్డు పరిస్థితుల్లో నీరవ్ మోడీ

 గడ్డు పరిస్థితుల్లో  నీరవ్ మోడీ

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌కు రూ.14  వేల కోట్లు టోకరా పెట్టిన నీరవ్ మోడీ పరిస్థితి తలకిందులయింది. ఇండియా నుంచి పారిపోకముందు రూ.కోట్లు సంపాదించిన ఇతడు ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇతడి కంపెనీ ఫైర్‌‌‌‌‌‌‌‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డిఐపిఎల్) ఖాతాలో కేవలం రూ. 236 ఉన్నాయి.  

నీరవ్​ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌బీఐకి రూ. 2.46 కోట్ల ఐటీ బకాయిలు బదిలీ కావడంతో బ్యాలెన్స్​ ఇంత తక్కువగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నీరవ్ చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే బదిలీ చేశాయి. మరికొంత మొత్తాన్ని ట్రాన్స్​ఫర్​ చేయాల్సి ఉంది.