రజనీకాంత్ వైఫ్‌కి బెయిల్‌ మంజూరు..అసలేం జరిగిందంటే?

రజనీకాంత్ వైఫ్‌కి బెయిల్‌ మంజూరు..అసలేం జరిగిందంటే?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) భార్య లతా రజినీకాంత్‌ (Latha Rajinikanth) పై కొన్నాళ్లుగా.. చెన్నైకి చెందిన యాడ్ ఏజెన్సీ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ (Kochadaiiyaan) సినిమా ప్రొడక్షన్ టైములో.. యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి  తీసుకున్న ఋణం..తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదయ్యింది.

దీంతో ఈ వివాదం కాస్త బెంగళూరులోని 1వ ఏసీఎంఎం కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో హాజరయ్యిన లతా రజినీకాంత్కు ఇవాళ బుధవారం (డిసెంబర్‌ 27) కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ మరియు రూ.25,000 నగదు అందించి..పలు రకాల కండిషన్స్తో బెయిల్‌ను పొందారు. కాగా లతా రజనీకాంత్ వెంట రజనీకాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంచితే.. డిసెంబర్‌ 1, 2023 న కోర్టు లతా రజినీకాంత్‌పై ఆరోపించిన నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తూ ఆమెను కోర్టుకు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దీంతో ముందస్తుగా బెయిల్ కోరారు లతా రజినీకాంత్. 

ALSO READ:-Kantara Prequel: ఆడిష‌న్‌కి 25 వేల మంది..వెలుగు కాదు ఏకంగా దర్శనమే

అసలేం జరిగిందంటే.. 

కొచ్చాడియాన్‌ సినిమాను మోషన్ పిక్చర్ టెక్నాలజీని ఉపయోగించి భారీగా ఖర్చు పెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. దీంతో ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్‌గా లతా రజనీకాంత్ సంతకం చేశారు.