Kantara Prequel: ఆడిష‌న్‌కి 25 వేల మంది..వెలుగు కాదు ఏకంగా దర్శనమే

Kantara Prequel:  ఆడిష‌న్‌కి 25 వేల మంది..వెలుగు కాదు ఏకంగా దర్శనమే

కాంతారా( Kantara)..కన్నడ ఇండస్ట్రీలో కెజియఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిన సినిమా. ఈ సినిమాకు అట్రాక్ట్ అవ్వని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. ఈ మూవీలో చూపించిన విజువల్స్కి గానీ, హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి యాక్టింగ్కి గానీ, అందులో ఉన్న ప్యూర్ కామెడీకి గానీ..ఇలా ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవ్వని ఆడియన్ ఉండరేమో అనిపిస్తోంది!

ఇక ఇప్పుడు కాంతార-ఎ లెజెండ్ చాప్టర్ 1( Kantara-A Legend Chapter 1) పేరుతో ప్రీక్వెల్ ని స్టార్ట్ చేసారు హీరో రిషబ్ శెట్టి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ కి పిలుపునివ్వ‌గా..ఇండియా వైడ్గా..నటించడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఇందుకోసం దాదాపుగా 25,000 మంది కంటే ఎక్కువ దరఖాస్తులు మేకర్స్కి అందినట్లు స‌మాచారం.ఇక వీటి నుంచి ఎంపిక చేసిన కొంద‌రు..ఇప్పటికే కాంతరా లోకంలోకి.. వివిధ పాత్రల్లో నటించడానికి సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది.

కాంతార-ఎ లెజెండ్ చాప్టర్ 1 స్టోరీ విషయానికి వస్తే..ఈ చిత్రం 301-400 AD కాలంలోని పంజుర్లీ దైవం మూలాన్ని తిరిగి కనుగొనే ప్ర‌క్రియ‌లో ఏం జ‌రిగింద‌నేది తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కాంతార ప్రీక్వెల్ కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. పార్ట్ 1 కోసం కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన మేకర్స్..ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో.. చాలా ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.