రీజినల్ బ్యాంకులు ఫెయిల్... యూఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి

 రీజినల్ బ్యాంకులు ఫెయిల్... యూఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి
  • తాజా బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌తో అధ్వాన స్థితిలోకి
  • క్రైసిస్ ముగిసినా.. బ్యాంకులు అప్పులివ్వడం తగ్గొచ్చు
  • ఈ నెల 21–22 న ఫెడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌..వడ్డీ రేట్లు 0.25% పెరుగుతాయని అంచనా

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వేగంగా పెరిగిన వడ్డీ రేట్లు ఇలా యూఎస్ ఎకానమీపై దెబ్బ మీద పడుతూనే ఉంది. తాజా బ్యాంకింగ్ క్రైసిస్ కూడా ఎకానమీని కోలుకోలేకుండా చేస్తోంది. రెండు వారాల కిందట స్టార్టయిన బ్యాంకింగ్ సంక్షోభం, ఎకానమీపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి. దశాబ్దాల గరిష్టాలకు చేరిన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు యూఎస్ ఫెడ్ మల్లగుల్లాలు పడుతుంటే, తాజాగా రీజినల్ బ్యాంకులు ఫెయిలవ్వడం  యూఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచాలా? బ్యాంకులు ఫెయిలవ్వకుండా ఉండాలంటే వడ్డీ రేట్లను తగ్గించాలా? అనే సందేహంలో ప్రస్తుతం ఫెడ్ ఉంది. ఈ  నెల 21–22 న ఫెడ్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను కనీసం 25 బేసిస్ పాయింట్లు పెంచుతారనే  అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్ క్రైసిస్ నెలకొనడం వలన వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న డిబేట్ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం యూఎస్ ఎకానమీ అధ్వాన్న స్థితిలో ఉందని చెప్పొచ్చు.  

చిన్న బిజినెస్‌‌‌‌‌‌‌‌లకు పెద్ద ఇబ్బంది..

రీజినల్ బ్యాంకుల్లో మొదలైన క్రైసిస్ పెద్ద బ్యాంకులకు షిఫ్ట్ కాకుండా ఉండేందుకు యూఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లకు కొంత ఊరటనిచ్చింది. అయినప్పటికీ, బ్యాంకులు ఇక నుంచి అప్పులివ్వడం తగ్గిపోతుందని నిపుణులు చేబుతున్నారు.  అంతేకాకుండా కంపెనీలు హైరింగ్ చేసుకోవడం పడిపోతుందని, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు తగ్గిపోతాయని  అన్నారు. బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ సేకరించడంలో ఇబ్బందులు పెరుగుతాయని, ఫలితంగా యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి జారుకోవడం తప్పదని అంటున్నారు.  ప్రస్తుత బ్యాంకింగ్ క్రైసిస్ పూర్తిగా సెటిలైనా, దీని ప్రభావం ఎకానమీలో కనిపిస్తుందని వెల్స్‌‌‌‌‌‌‌‌ ఫార్గో చీఫ్ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌ జే బ్రేసన్ అన్నారు. రెసిషన్‌‌‌‌‌‌‌‌ వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయని చెప్పారు. గత  ఏడాది కాలంలోనే ఫెడ్ వడ్డీ రేట్లను జీరో నుంచి 5 శాతానికి పెంచింది. వడ్డీ రేట్లు వేగంగా పెరగడం వలన ఫైనాన్షియల్ స్టెబిలిటీకి భంగం కలుగుతుందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎఫెక్ట్  బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోంది. 

ఎకానమీ రికవరీ అవుతున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో దెబ్బ..

యూఎస్ ఎకానమీ పాత గాయాల నుంచి రికవరీ అవుతున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో  బ్యాంకింగ్ క్రైసిస్  వచ్చి పడింది. కిందటేడాది పడిపోయిన వినియోగం, ఈ ఏడాది ప్రారంభంలో రీబౌండ్ అయ్యింది.   వడ్డీ రేట్లు పెరగడంతో దెబ్బతిన్న  హౌసింగ్ మార్కెట్, నిలకడగా ఉంది. అలానే లేఆఫ్స్ పెరిగినా, గత కొన్ని నెలలుగా  జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో గ్రోత్ కనిపించింది. యూఎస్ గ్రోత్ అంచనాలను ఎకనామిస్టులు పెంచడం కూడా చూశాం. కనీసం ఈ ఏడాది లోనైనా  రెసిషన్ ఉండదని అనే వార్తలొచ్చాయి. బ్యాంకింగ్ సంక్షోభం వలన చాలా మంది ఎకనమిస్టులు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. వెల్స్‌‌‌‌‌‌‌‌ ఫోర్గ్ ఎకనామిస్ట్ జే బ్రేసన్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడానికి 65 శాతం అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ నెంబర్ 55 శాతంగా ఉందని అన్నారు.  

యూఎస్ బ్యాంక్​ను కొననున్న బఫెట్‌‌‌‌‌‌‌‌?

బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌పై చర్చించేందుకు సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెన్ బఫెట్‌‌‌‌‌‌‌‌  యూఎస్ ప్రభుత్వంతో సమావేశం కానున్నారు. దివాలా తీసిన బ్యాంకుల్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తారనే అంచనాలు పెరిగాయి. గతంలో కూడా బ్యాంకులు సంక్షోభంలో ఉన్నప్పుడు బఫెట్ ముందుకొచ్చి, సాయం అందించారు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికాకు 2011 లో  మోర్టగేజ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో నష్టాలు వచ్చాయి. దీంతో బ్యాంక్ షేరు భారీగా పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో 5 బిలియన్ డాలర్లను బఫెట్ ఇన్వెస్ట్ చేశారు. 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్‌‌‌‌‌‌‌‌ వలన మునిగిన గోల్డ్‌‌‌‌‌‌‌‌మాన్‌‌‌‌‌‌‌‌ శాచ్స్‌‌‌‌‌‌‌‌కు ఆర్థికంగా 
సపోర్ట్ ఇచ్చారు.

షేరుకి 27 సెంట్లే ఇస్తాం..

ఒకప్పుడు 90 బిలియన్ డాలర్లు విలువ చేసిన క్రెడిట్ స్వీస్‌‌ కంపెనీని కొనుగోలు చేయడానికి ఒక బిలియన్ డాలర్లను యూబీఎస్ గ్రూప్ ఆఫర్ చేసింది. స్విస్ సెంట్రల్ బ్యాంక్ గ్యారెంటీగా ఉంటే కొనుగోలు చేయడానికి రెడీ అని పేర్కొంది. యూబీఎస్ ఇచ్చిన ఆఫర్‌‌‌‌ను క్రెడిట్ స్వీస్‌‌ తిరస్కరించింది. కాగా, రెండు రోజుల కిందటతో పోలిస్తే క్రెడిట్ స్వీస్ వాల్యూని యూబీఎస్‌‌ 87 శాతం తగ్గించింది. అంటే షేరుకి 27 సెంట్లే ఇవ్వడానికి ముందుకొచ్చింది.