పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

హైదరాబాద్: పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో ఈ నెల 29 న పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యా నగర్ లోని బీసీ భవన్ లో బీసీ సంఘాల నాయకులతో ఆర్.కృష్ణయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిల్లు కోసం ఈ నెల 29న పార్లమెంట్ వద్ద ప్రదర్శనతో పాటు, 30న అఖిల పక్ష సమావేశం, 31 నుంచి ఏప్రిల్ 2 వరకు పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లు గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తుందని అన్నారు.

బీసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు, రాయితీలు కల్పించడంలేదని మండిపడ్డారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ ఉద్యమం మిలిటెంట్ ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. బీసీల హక్కులు సాధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!