
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
పవర్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ వచ్చేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు గానూ రెండు పవర్ఫుల్ ఇంట్రో సీన్స్‌ను రాసుకుని..పవన్ కు వినిపించినట్లు సమాచారం.ఈ ఇంట్రో సీన్స్ ఓజీ మూవీకే కాకుండా, పవన్ కెరీర్లోనే బెస్ట్ పవర్ ప్యాక్డ్ ఎంట్రీ సీన్స్ గా సుజీత్ డిజైన్ చేసారంట. 15నిమిషాల పాటు సాగే ఇంట్రో సీన్ కోసం పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారని ఓజీ యూనిట్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
పవన్ నుండి వస్తున్నసినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది.
పవన్ ఫ్యాన్స్ ఓజీ సినిమా అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నేపధ్యంలో..మేకర్స్ వాళ్లకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెల్సుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.