గేమర్స్‌‌‌‌ కోసం స్పెషల్ ల్యాప్‌టాప్స్..

గేమర్స్‌‌‌‌ కోసం స్పెషల్ ల్యాప్‌టాప్స్..

ఒకప్పుడు గేమ్స్‌‌‌‌ ఆడాలంటే సపరేట్‌‌‌‌ సెటప్‌‌‌‌ అవసరం. జాయ్‌‌‌‌స్టిక్స్‌‌‌‌, మానిటర్‌‌‌‌‌‌‌‌, కీ బోర్డు కావాలి. వాటిని సపరేట్‌‌‌‌గా టీవీకి కనెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. కానీ, ఇప్పుడు గేమింగ్‌‌‌‌ కోసం స్పెషల్‌‌‌‌గా ల్యాప్‌‌‌‌టాప్స్‌‌‌‌ వచ్చాయి. ‘బ్యాటిల్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌ మొబైల్‌‌‌‌ ఇండియా’, ‘యమాంగ్‌‌‌‌ అజ్‌‌‌‌’ లాంటి గేమ్స్‌‌‌‌కు చాలా క్రేజ్‌‌‌‌ ఉంది. ఆ గేమ్స్​ ఆడేవాళ్ల కోసం చాలా కంపెనీలు స్పెషల్​గా గేమింగ్‌‌‌‌ లాప్‌‌‌‌టాప్స్‌‌‌‌ను తెచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో టెక్‌‌‌‌ లవర్స్‌‌‌‌ను మెస్మరైజ్‌‌‌‌ చేస్తున్నాయి. కేవలం గేమింగ్‌‌‌‌ కోసమే కాకుండా అన్ని విధాల వాడుకునేలా వీటిని డిజైన్‌‌‌‌ చేశాయి.

హెచ్‌‌‌‌పీ పెవిలియన్‌‌‌‌ గేమింగ్

హెచ్‌‌‌‌పీ కంపెనీ రిలీజ్‌‌‌‌ చేసిన ఈ ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లో 15.6 హెడ్‌‌‌‌డీ డిస్‌‌‌‌ప్లే. 144 హెచ్‌‌‌‌జడ్‌‌‌‌ రిఫ్రెష్‌‌‌‌ రేట్‌‌‌‌తో, ఇంటెల్‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ ఐ5 టెన్త్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ ప్రాసెసర్‌‌‌‌ ఉంది. 8జీబీ డీడీఆర్‌‌‌‌‌‌‌‌4 ర్యామ్‌‌‌‌ ఉన్నప్పటికీ దాన్ని 32 జీబీ వరకు అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేసుకోవచ్చు. దాంతోపాటుగా Nvidia GeForce GTX 1650 GDDR6 గ్రాఫిక్‌‌‌‌ గార్డ్‌‌‌‌ విత్‌‌‌‌ 4GB VRAM ఉంది. కూలింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌తో పాటు కనెక్టివిటీ కోసం సీ టైప్‌‌‌‌ యూఎస్‌‌‌‌బి పోర్ట్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌జే45 పోర్ట్‌‌‌‌ కూడా ఉంది.

ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ బ్రావో 15

ఈ ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లో స్పెషల్‌‌‌‌గా రెండు టైప్‌‌‌‌సీ యూఎస్‌‌‌‌బీలు, ల్యాన్‌‌‌‌ కోసం ఆర్‌‌‌‌‌‌‌‌జే45 పోర్ట్‌‌‌‌ ఉంటుంది. 15.6 హెచ్‌‌‌‌డీ ఐపీఎస్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లేతో వస్తుంది. 144హెచ్‌‌‌‌జడ్‌‌‌‌ రీఫ్రెష్‌‌‌‌ రేట్‌‌‌‌. 4800 హెచ్‌‌‌‌ ఏమ్‌‌‌‌డీ రైజన్‌‌‌‌7 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. 16జీబీ ర్యామ్‌‌‌‌, 512 జీబీ ఎన్‌‌‌‌బీఎమ్‌‌‌‌ఈ.2 ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌డీతో వస్తుంది. దాంతో పాటుగా ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌5 500ఎమ్‌‌‌‌ గ్రాఫిక్‌‌‌‌ కార్డు కూడా ఉంది. బ్యాక్‌‌‌‌లిట్‌‌‌‌ (రెడ్‌‌‌‌) కీ బోర్డ్‌‌‌‌ దీని ప్రత్యేకత.  ఈ ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లతో పాటు లెనోవో ఐడియాప్యాడ్‌‌‌‌3, హెచ్‌‌‌‌పీ నుంచి విక్టస్‌‌‌‌ ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు కూడా హై ఎండ్‌‌‌‌తో వచ్చాయి.

లెనోవో లీజియన్‌‌‌‌ 5

ల్యాప్‌‌‌‌టాప్స్‌‌‌‌లో కొత్త టెక్నాలజీ తీసుకురావడంలో లెనోవో ఎప్పుడూ ముందుంటుంది.  ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో టెక్‌‌‌‌ లవర్స్‌‌‌‌ ముందుకు వస్తుంది. ‘లెనోవో లీజియన్‌‌‌‌ 5’ పేరుతో తీసుకొచ్చిన గేమింగ్‌‌‌‌ ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లో లీజియన్‌‌‌‌ ట్రూస్ట్రైక్‌‌‌‌ కీ బోర్డ్‌‌‌‌ ఉంది. ఆర్‌‌‌‌‌‌‌‌జీబీ బ్యాక్‌‌‌‌ లైటింగ్‌‌‌‌తో, యాంటిగోస్టింగ్‌‌‌‌ స్విచ్‌‌‌‌లతో ఉంటుంది ఈ కీ బోర్డ్‌‌‌‌. 15.6 హెడ్‌‌‌‌డీ, ఐపీఎస్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే. 120 హెచ్‌‌‌‌జడ్‌‌‌‌ రిఫ్రెష్‌‌‌‌ రేట్‌‌‌‌, ఇంటెల్‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌ ఐ7 11వ జనరేషన్‌‌‌‌ ప్రాసెసర్‌‌‌‌ ఉంది. 16 జీబీ డీడీఆర్‌‌‌‌‌‌‌‌4 ర్యామ్‌‌‌‌ కాగా.. దాన్ని 32 జీబీ వరకు ఎక్స్‌‌‌‌పాండ్‌‌‌‌ చేసుకోవచ్చు. 512 జీబీ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌డీ, GeForce RTX 3050 GDDR6 గ్రాఫిక్‌‌‌‌ కార్డ్‌‌‌‌, అదనంగా 4జీబీ వి ర్యామ్‌‌‌‌ వచ్చింది.