అమెరికా గ్రీన్ కార్డ్ కంట్రీ కోటా ఎత్తివేత

అమెరికా గ్రీన్ కార్డ్ కంట్రీ కోటా ఎత్తివేత

అమెరికా గ్రీన్ కార్డ్ కంట్రీ కోటా ఎత్తివేత
సిటిజన్​షిప్ యాక్ట్​ను ప్రవేశపెట్టిన బైడెన్ సర్కారు

వాషింగ్టన్ : అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నోళ్లకు బైడెన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. డ్రీమర్లు, టీపీఎస్ హోల్డర్లు, ఫామ్ వర్కర్లకు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు గ్రీన్ కార్డ్ కంట్రీ కోటాను తొలగించనున్నట్లు పేర్కొంది. ఇందుకు డెమోక్రటిక్ పార్టీ యూఎస్ సిటిజన్ షిప్ యాక్ట్​2023ను ప్రతినిధుల సభలో గురువారం ప్రవేశపెట్టింది. ఈ యాక్ట్ ద్వారా హెచ్1బీ వీసా వ్యవస్థలోనూ మార్పులు జరగనున్నాయి. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా ట్యాక్స్ పేయర్లుగా ఉంటున్న కోటీ 10 లక్షల మంది ఇమిగ్రెంట్లకు గ్రీన్​కార్డ్ కల్పించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించనుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం అమెరికా ఏడాదికి 140,000 గ్రీన్ కార్డ్​లను మాత్రమే జారీ చేస్తోంది. ఇందులో ఒక దేశానికి 7 శాతం అంటే 9,800 మందికి మాత్రమే పర్మినెంట్ రెసిడెన్సీ కార్డ్ పొందడం సాధ్యం అవుతుంది. కొత్త చట్టం ప్రకారం గ్రీన్ కార్డుల జారీపై పరిమితి తొలగిపోనుంది. దీంతో దేశాలవారీగా కోటా కింద జారీ చేస్తున్న గ్రీన్ కార్డుల కోసం.. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న ఇండియన్ టెకీలు అత్యధికంగా లబ్ధి పొందనున్నారు.