ఉత్తరాఖండ్‌‌‌‌ సీఎంగా రీతూ ఖండూరీ?

ఉత్తరాఖండ్‌‌‌‌ సీఎంగా రీతూ ఖండూరీ?

డెహ్రాడూన్‌‌‌‌: ఉత్తరాఖండ్​ మాజీ సీఎం బీసీ ఖండూరీ కూతురు రీతూ ఖండూరీ ని ఇప్పుడు సీఎంగా నియమించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కోట్‌‌‌‌ద్వార్‌‌‌‌‌‌‌‌ నియోజక వర్గం నుంచి రీతూ గెలుపొందారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న ధామి ఓడిపోవ డంతో.. రీతూ ఖండూరీని ఉత్తరాఖండ్‌‌‌‌ సీఎంగా నియమించే అవకాశాలు ఎక్కు వగా కనిపిస్తున్నాయి. సీఎం నియామకం పై చర్చించేందుకు ఢిల్లీ రావాలని బీజేపీ నాయకత్వం నుంచి ఆమెకు పిలుపు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే పుష్కర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ ధామి, సుబోధ్‌‌‌‌ ఉనియల్‌‌‌‌లకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు అందింది. ఈ ఏడాది ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌‌‌‌లో బీజేపీకి మహిళా ఓటర్లు ఎక్కువగా మద్దతు ఇవ్వడంతో, రాష్ట్రానికి మహిళా సీఎం అయితే బాగుంటుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలి సింది. అలాగే రీతూ ఖండూరీ భర్త రాజేశ్‌‌‌‌ భూషణ్‌‌‌‌ ప్రధాని మోడీకి సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వంలో సీనియర్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌ సెక్రటరీగా పనిచేస్తున్నా రు. దీంతో రీతూను ఉత్తరాఖండ్‌‌‌‌ సీఎంగా నియమించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.