యువ మోర్చాకు 10 టికెట్లు కేటాయించాలి : బీజేవైఎం వినతి

యువ మోర్చాకు 10 టికెట్లు కేటాయించాలి : బీజేవైఎం వినతి
  • యువ మోర్చాకు 10 టికెట్లు కేటాయించాలి
  • బీజేవైఎం వినతి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర యువతకు కేసీఆర్ చేసిన మోసాలను నిరసిస్తూ నిరుద్యోగుల తరఫున ఎన్నో పోరాటాలు చేసి, జైలుకు వెళ్లామని..ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కనీసం పది సీట్లు కేటాయించాలని బీజేవైఎం నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.