భార్యా భర్తల స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ..ఈ వీడియో..

భార్యా భర్తల స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ..ఈ వీడియో..

భార్యా భర్తల సంబంధం అంటే మూడు ముళ్ళు వేసి, మూడు రాత్రులు గడపడంకాదు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండటం. ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్న నీకు నేనున్నాను అనే భరోసాని ఇవ్వడం. అలాంటి భార్యాభర్తల ప్రేమకు ఓ వీడియో  నిర్వచనంగా నిలుస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమకు సమయం..స్థలంతో పనిలేదని ఈ వీడియో నిరూపిస్తోంది. తన భార్య నిద్రపోతున్న వేళ..ఆమె తలపై నిమురుతూ..తన ప్రేమను చాటుకున్నా భర్త  వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. 


 
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం..
ఒక వ్యక్తి  కర్ణాటకలోని ఓ బస్ స్టేషన్‌లో తన భార్యతో బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే అప్పటికే తన ఒడిలో నిద్రపోతున్న భార్య నుదిటిపై ప్రేమగా చేతితో నిమురుతూ ఉంటాడు. ఓ గుడ్డను కప్పుకుని భర్త ఒడిలో భార్య నిద్రపోతుంది.  ఆమెను చిన్న పిల్లలా భావించే  భర్త ..భార్య నిద్రపుచ్చుతూ ఉంటాడు. @Gulzar_sahab అనే నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియో  స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.

వీడియో వైరల్..
ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి  ప్రజలను హృదయాలను చేరింది. వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 20 వేల కంటే ఎక్కువ మంది  వీక్షించారు. వేల సంఖ్యలో  లైక్‌లు, కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వీడియో ప్రజల మధ్య ప్రేమను, భార్య భర్తల అనుబంధాన్ని గుర్తు చేస్తోంది.