8 నుంచి బార్లు, పబ్‌‌‌‌లు ఓపెన్‌‌‌‌?

8 నుంచి బార్లు, పబ్‌‌‌‌లు ఓపెన్‌‌‌‌?

కేంద్రం ఓకే అంటే.. రాష్ట్రంలో తెరిచే చాన్స్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో బార్లు, పబ్‌‌‌‌లు రీఓపెన్ కానున్నాయని తెలిసింది. ఈ నెల 8వ తేదీ తర్వాత వాటిని తెరిచేందుకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఎక్సైజ్‌‌‌‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొన్నిచోట్ల బార్లు, రెస్టారెంట్లు కలిసే ఉంటాయి. దీంతో బార్లకూ  అనుమతి రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటిదాకా బార్లు, పబ్‌‌‌‌లపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం అనుమతించిన వెంటనే రాష్ట్రం కూడా ఓకే చెప్పనుందని అంటున్నారు. రాష్ట్రంలో అన్నీ ఓపెన్‌‌‌‌ చేస్తున్నప్పుడు బార్లు, పబ్‌‌‌‌లు ఎందుకు తెరవకూడదనే అంశం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో మార్చి15 నుంచి పబ్‌‌‌‌లు, బార్‌‌‌‌లు, పర్మిట్‌‌‌‌ రూమ్‌‌‌‌లు బంద్‌‌‌‌ చేశారు. మార్చి 22 నుంచి వైన్ షాపులూ బంద్‌‌‌‌ అయ్యాయి. మే 6 నుంచి వైన్స్‌‌‌‌లకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చినా బార్లు, పబ్‌‌‌‌లకు అనుమతి ఇవ్వలేదు.

తాటి, ఈత చెట్ల గడువు10 ఏళ్లకు పెంపు: శ్రీనివాస్ గౌడ్‌‌‌‌  

గీత కార్మికులకు సభ్యత్వ కార్డులను ఇవ్వాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో ఆబ్కారీ శాఖపై రివ్యూ నిర్వహించారు. టీఎఫ్‌‌‌‌టీ, టీసీఎస్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ల కాల పరిమితిని10 ఏళ్లు పెంచినట్లు మంత్రి చెప్పారు. సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాల పరిమితిని 10 ఏళ్లకు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని  ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్