మునగ ఎగుమతులపై కేంద్రం ఫోకస్

మునగ ఎగుమతులపై కేంద్రం ఫోకస్

మునగ గ్లోబల్​ మార్కెట్​రూ.63 వేల కోట్లు
మన ఎగుమతులు పెంచుకునే ఛాన్స్​

వెలుగు బిజినెస్​ డెస్క్:​ఎన్నో పుష్కలమైన మెడిసినల్​ వాల్యూస్​ ఉండే  మునగ గ్లోబల్​ మార్కెట్ సైజు 7 .7 బిలియన్​ డాలర్ల   (రూ.63 వేల కోట్ల) దాకా ఉంటుందని అంచనా. ఇటీవలి నెలల్లో మన దేశపు ఎగుమతులు కొద్దిగా తగ్గడంతో ప్రభుత్వం ఇప్పుడు ఎగుమతులు పెంచుకోవడంపై ఫోకస్​ పెడుతోంది. ఇందుకు అనుకూలమైన స్పెషల్​ ప్రొడక్ట్స్​ను గుర్తించే ప్రయత్నంలో ఉంది. అలాంటి ప్రొడక్ట్స్​లో మునగ ఒకటిగా చెప్పుకోవచ్చు. మునగ (డ్రమ్​స్టిక్స్​) ఆకులలో ప్రొటీన్స్​ ఎక్కువ. ఏ, బీ, సీ విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాదు, వాటిలో కొన్ని మినరల్స్​ఉన్నాయి.  మునగ లేదా మునగ ప్రొడక్ట్స్​లో   యాంటిబయాటిక్​, హైపోటెన్సివ్​, యాంటిస్పాస్మాడిక్​, యాంటిఅల్సర్, యాంటి ఇన్​ఫ్లమేటరీ , హైపోగ్లైసిమిక్​ లక్షణాలుంటాయని ఫుడ్​ అండ్​ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్​ (ఎఫ్​ఏఓ) చెబుతోంది. ఇన్​ఫ్లమేషన్​, గాల్​బ్లాడర్​​, కిడ్నీ ఇన్​ఫెక్షన్​, డయాబెటిస్​ వంటి వాటిని నయం చేయడానికి మునగ ప్రొడక్ట్స్​ బాగా ఉపయోగపడతాయి. మునగపై 20 ఏళ్లు రీసెర్చ్​ చేసిన కాలిఫోర్నియా యూనివర్శిటీ రీసెర్చర్​ ఈ విషయాలు వెల్లడించారు. మన దేశంలో చాలా వ్యాధుల చికిత్సకు మునగను వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 


గిరాకీ పెరుగుతోంది!

మునగ ప్రొడక్ట్స్​కు ప్రధానంగా అమెరికా, జర్మనీ, కెనడా, చైనా, సౌత్​ కొరియా దేశాలలో బాగా డిమాండ్​ ఉంది.  ఈ నేపథ్యంలో మన దేశం నుంచి మునగ ఎగుమతులు పెంచుకోవడానికి మెరుగైన అవకాశం ఉంది.  అగ్రికల్చరల్​ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్​ ప్రొడక్ట్స్​ ఎక్స్​పోర్ట్​ డెవలప్​మెంట్​ అథారిటీ (ఎపెడా) రిపోర్టు ప్రకారం మన దేశంలో ఏటా 2.2 మిలియన్​ టన్నుల మునగ కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 

ఆర్గానిక్​ మునగ కూడా..!

ఎగుమతులు పెరగడానికి మునగతో ఛాన్స్​లు ఎక్కువేనని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత గుర్తించిన సూపర్​ ఫుడ్స్​లో  మునగ కూడా ఒకటి. ఇటీవలి సంవత్సరాలలో కొంత మంది వ్యాపారులు​ మునగపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు తెలంగాణలోని మేడికొండ న్యూట్రియెంట్స్​ 2020 డిసెంబర్​లో 2 టన్నుల ఆర్గానిక్​ మూరింగ (మునగ) పౌడర్​ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019లో మొత్తం 530 టన్నుల మూరింగ ప్రొడక్ట్స్​ను ఎగుమతి చేశామని మేడికొండ న్యూట్రియెంట్స్​ సీఈఓ అమర్​ మేడికొండ చెప్పారు. 2020–21లో రూ. 20 కోట్లు, 2021–22లో రూ. 15 కోట్ల విలువైన మూరింగ ప్రొడక్ట్స్​ ఎగుమతి అయినట్లు ఎపెడా ప్రతినిధి వెల్లడించారు. 2019–20 లో దేశం నుంచి 480 టన్నుల మూరింగ లీఫ్​ పౌడర్​, 49 టన్నుల మూరింగ డ్రూ లీవ్స్​, 11 టన్నుల మూరింగ ఆయిల్​ ఎగుమతి అయినట్లు అమర్​ మేడికొండ పేర్కొన్నారు. 2018 నుంచి ఢిల్లీ కంపెనీ టెర్రీ ఎక్స్​పోర్ట్స్​ కూడా మూరింగ ప్రొడక్ట్స్​ను ఎగుమతి చేస్తోంది. కోయంబత్తూర్​లో కాంట్రాక్టు బేసిస్​ మీద ఈ కంపెనీ మూరింగ సాగు చేస్తోంది. గల్ఫ్​, దక్షిణ అమెరికాల నుంచి కూడా ఇప్పుడు ఆసక్తి కనబడుతోందని, ముఖ్యంగా మూరింగ సీడ్స్​ కోసం అడుగుతున్నారని, ఇమ్యూనిటీని పెంచే మునగ, అశ్వగంధ, పసుపు వంటి వాటికి డిమాండ్ ఉందని టెర్రీ ఎక్స్​పోర్ట్స్​ ఎండీ దీపాంకర్​ వర్మ చెప్పారు.