దేశ‌వ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ ‌స్కూల్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

దేశ‌వ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ ‌స్కూల్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీ మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం  చేకూరుతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న‌డిపే పాఠశాలల నుంచి పీఎం శ్రీ స్కూల్స్ ను ఎంపిక‌ చేసయనున్నట్లు వెల్లడించింది. ఈ పాఠశాలల అభివృద్ధికి వచ్చే ఐదేండ్లలో రూ.27,360 కోట్లు ఖ‌ర్చు చేస్తామని పేర్కొంది. ఈ నిధులలో కేంద్రం వాటా రూ.18,128 కోట్లని తెలిపింది. నూత‌న జాతీయ విద్యా విధానం అమ‌లులో భాగంగా పీఎం శ్రీ మోడల్ స్కూల్స్ ను ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతామని  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ ఆధారంగా విద్యాబోధ‌న‌కు ప్రాధాన్యత ఇవ్వడమే పీఎం శ్రీ మోడల్ స్కూళ్ల లక్ష్యమన్నారు. 

పీఎం గతిశక్తి ఫ్రేమ్ వర్క్ అమలు చేయడానికి రైల్వే భూములను 35 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 5 ఏళ్లలో 300 కార్గో టెర్మినల్స్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం,పీపీపీ ప‌ద్ధతిలో ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాల‌యాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.