అమర్నాథ్ యాత్రకు వేళాయె

అమర్నాథ్ యాత్రకు వేళాయె

శ్రీనగర్: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా వల్ల రెండేళ్లుగా ఆగిపోయిన అమర్నాథ్ యాత్రను నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. ఇందుకు భక్తుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన దేశంలోని మొత్తం 316 బ్రాంచుల్లో అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్బీఐకు చెందిన 100 బ్రాంచుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11 నుంచి జూన్ 30వరకు రిజిస్ట్రేషన్ కు తుది గడువు విధించారు. అలాగే 13 నుంచి 75 ఏళ్ల వయసు గల ఎవరైన ఈ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే  అమర్నాథ్ దేవస్థానానికి దగ్గర్లో ఉన్న గుర్తింపు పొందిన హాస్పిటల్స్ నుంచి తాము ఆరోగ్యంగా ఉన్నామనే సర్టిఫికెట్ ను భక్తులు తీసుకురావాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం...

ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించండి