అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్

అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్

టీఎస్పీఎస్సీ నిర్వహించిన తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. హాల్‌టికెట్ నెంబర్ల ఆధారంగా రిసల్ట్స్ చూసుకోవచ్చు. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ 18, 19వ తేదీల్లో నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకం ద్వారా మొత్తం 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారి నుంచి 2023 జనవరి 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 16న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ మే 17న కమిషన్ విడుదల చేసింది. 2024 ఫిబ్రవరి 6న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఫిబ్రవరి 17న అభ్యర్థులు ర్యాంకులను ప్రకటించింది. తాజాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.