
హైదరాబాద్: ముసానగర్ లోని ఓ ఇంట్లో బుధవారం ఉదయం నాగు పాము కలకలం సృష్టించింది. సడెన్ గా ఇంట్లో పామును చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనతో పరుగులు తీశారు. చుట్టు పక్కలవారు కూడా కంగారు పడ్డారు. వెంటనే ఇంటి యజమాని చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారందిoచడంతో.. పోలీసులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు.పాములు పట్టే వ్యక్తి అక్కడకు వచ్చి చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పామును నెహ్రు జూపార్క్ అధికారులకు అప్పగించారు పోలీసులు.