కశ్మీర్ పండిట్లను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తరిమికొట్టాయి

 కశ్మీర్ పండిట్లను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తరిమికొట్టాయి

కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ప్రభుత్వాలు లక్షల కొద్దీ కశ్మీర్ పండిట్లను తరిమికొట్టాయని బీజేపీ ఎంపీ కేజే అల్ఫోన్స్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో జమ్మూ పండిట్ల కోసం 5,242 గృహాలు, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సాయం, రూ.1,168.4 కోట్ల విలువైన పలు సంక్షేమ పథకాలు అమలు చేసిందని కేరళ కాంగ్రెస్ ట్విట్టర్ పేర్కొంది. బీజేపీ ఎంపీ  కేజే అల్ఫోన్స్ కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. 

కాంగ్రెస్ చరిత్రను వక్రీకరిస్తోందని, వారు చెప్పేవన్నీ అబద్ధాలనేనని కొట్టిపారేశారు.370 ఆర్టికల్ తో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు  కశ్మీర్ లోని పండిట్లకు జీవించలేని పరిస్థితిని సృష్టించాయన్నారు. మత పరమైన హింసకు ఎంతోమంది పండిట్లు బలయ్యారన్నారు. తమ ప్రాణాలకు రక్షణలేకపోవడంతో ఒకటిన్నర లక్షల మంది పండిట్లు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేసి కశ్మీర్ పండిట్లకు స్వేచ్ఛను ప్రసాదించారన్నారు.