సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ కసరత్తు

సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ కసరత్తు
  • సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ కసరత్తు
  • కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ
  • ఆరు గంటల పాటు సాగిన చర్చ
  • వీలైనంత త్వరగా సెకండ్ లిస్ట్: మాణిక్ రావ్​ ఠాక్రే
  • లెఫ్ట్ పార్టీలతో చర్చిస్తున్నం: మురళీధరన్

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సెకండ్‌‌‌‌ లిస్టును వీలైనంత త్వరగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌‌‌‌ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. మిగతా సీట్లకు క్యాండిడేట్ల ఎంపికపై శనివారం ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించింది. ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. 

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్.. రాత్రి 10 గంటల దాకా సాగింది. ఆరు గంటల పాటు సాగిన ఈ భేటీలో.. పెండింగ్ లో ఉన్న 64 స్థానాలు, లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చించారు. అంతకుముందు మీడియాతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై చర్చించబోతున్నట్లు వెల్లడించారు. ఏ సమయంలో అయినా ఫైనల్ లిస్ట్ రావచ్చన్నారు.

చాలా మంది పోటీ పడుతున్నరు: మాణిక్ ఠాక్రే

కాంగ్రెస్ నుంచి ఒక్కో సీటు కోసం అనేక మం ది ఆశావహులు పోటీపడుతున్నాని పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని విమర్శించారు. ‘‘స్ర్కీనింగ్ కమిటీ నివేదికను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) ముందు పెడతాం. త్వరలోనే సీఈసీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తాం” అని చెప్పారు. లెఫ్ట్ పార్టీలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో మరోసారి రాహుల్, ప్రియాంకా గాంధీ టూర్లు ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌‌‌‌లో రెబల్స్ లేరని అన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.