యువతను కాంట్రాక్టు వర్కర్స్ గా మార్చేదే అగ్నిపథ్

యువతను కాంట్రాక్టు వర్కర్స్ గా మార్చేదే అగ్నిపథ్

న్యూఢిల్లీ, వెలుగు: అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జూన్ 27న దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రజా ప్రతినిధులకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దీక్షకు సంబంధించి పలు సూచనలు చేశారు.  ఏఐసీసీలో పార్టీ మాజీ చీఫ్ రాహుల్, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ,  పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశ సైనిక వ్యవస్థను బలహీనపర్చి.. యువతను కాంట్రాక్టు వర్కర్స్ గా మార్చే అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈ నెల27న దీక్షలు చేపట్టాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దీక్షలు చేయాలని తెలిపారు. 

సిన్హాకు మద్దతుగా కాంగ్రెస్ సంతకాలు

రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు