దోచుకోవాలనే దేశ రాజకీయాలు స్టార్ట్ చేసిండు : వైఎస్ షర్మిల

దోచుకోవాలనే దేశ రాజకీయాలు స్టార్ట్ చేసిండు : వైఎస్ షర్మిల

కేసీఆర్​పై వైఎస్ షర్మిల ఫైర్

హైదరాబాద్, వెలుగు : దోచుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ దేశ రాజకీయాలు మొదలుపెట్టారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. “నేను భారత దేశ పౌరుడుని -ఎక్కడికైనా వెళ్తా ” అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లపై ఫైర్ అయ్యారు. "నిన్నటిదాకా తెలంగాణ మా తాతల జాగీరని, ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత నాకు తప్ప ఎవరికి లేదని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు దేశం మీదకు బయలుదేరారు" అని సోమవారం ఎద్దేవా చేశారు. "లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే, ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులేనని ఉద్యమ టైమ్ లో ప్రజలను రెచ్చగొట్టి కేసీఆర్ పబ్బం గడుపుకున్నడు. నేను తెలంగాణ కోడలినైనప్పటికీ ఆంధ్రా ద్రోహినని బీఆర్ఎస్ నేతలు అవహేళన చేశారు. కేసీఆర్ కు నేను కూడా ఈ దేశ పౌరురాలినని గుర్తుకురాలేదా.?" అని షర్మిల ప్రశ్నించారు.