ప్రేమ పెళ్లి: రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. మధ్యలో వదిలేశారు

ప్రేమ పెళ్లి: రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. మధ్యలో వదిలేశారు

హైదరాబాద్:  ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు పోలీసులు రక్షణ కల్పించలేదని ఓ జంట వాపోయింది. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని నేరడ గ్రామానికి చెందిన అనిల్, స్వప్న ఈనెల 28న చెంగిచెర్ల ఆర్య సమాజ్‌‌‌లో వివాహం చేసుకున్నారు. అయితే పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం కురవి పోలీస్ స్టేషన్‌‌కు ప్రేమ జంట బయలుదేరారు. వీరిని మార్గమధ్యలో తొర్రూర్ వద్ద అమ్మాయి తరఫున కొందరు వ్యక్తులు అడ్డగించారు. అప్రమత్తమైన ప్రేమ జంట అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లారు. కానీ రక్షణ కల్పిస్తామన్న పోలీసులు వారిని మధ్యలోనే వదిలేశారు. అమ్మాయి తల్లిదండ్రులు దాడికి యత్నించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ని ప్రేమజంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలని కమిషన్‌‌ను ప్రేమ జంట కోరింది.