పుష్ప2 నుండి కపుల్ సాంగ్ వచ్చేసింది..

పుష్ప2 నుండి కపుల్ సాంగ్ వచ్చేసింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్లో పుష్ప2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలవటమే కాకుండా బన్నీకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా తెచ్చి పెట్టింది పుష్ప ది రైజ్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తున్న సినిమా కావటంతో పుష్ప2 మీద మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఈ క్రమంలో పుష్ప2 నుండి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. సూసేకి అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ మెలోడియస్ గా ఉంది. అల్లు అర్జున్, రష్మిక వేసిన సింపుల్ స్టెప్స్ ఈ సాంగ్ కి హైలైట్ గా నిలిచాయి. మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కి మాస్ ఆడియెన్స్ ని ఫిదా చేసిన డీఎస్పీ, ఈసారి తన మార్క్ మెలోడీ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ ని అలరించాడు. మరి, ఆగస్టు 15న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలు అందుకొని బన్నీకి మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా వేచి చూడాలి. 

ALSO READ | ఐకాన్ స్టార్ క్రేజ్: పుష్ప స్టెప్ తో అదరగొట్టిన యువకుడు.. వీడియో వైరల్