నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను మంగళవారం డ్యాం అధికారులు పూర్తి స్థాయిలో మూసివేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో డ్యాం అధికారులు జూలై 30న గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 20 రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కిందికి వదిలారు. ప్రస్తుతం ఎగువ నుంచి ఇన్​ఫ్లో భారీగా తగ్గడంతో పూర్తి స్థాయిలో గేట్లను దించివేశారు. సాగర్ కెపాసిటీ 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.20 అడుగుల నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306.6922 టీఎంసీలున్నాయి. కాగా సాగర్ నుంచి ఎడమ కాలువకు 8,108 క్యూసెక్కులు, కుడికాల్వకు 9,160 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 2,400, వరదకాల్వకు 400, మెయిన్ పవర్ హౌస్ ద్వారా 33,373 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.