ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు జులై 31 వరకు పొడిగింపు

ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు జులై 31 వరకు పొడిగింపు
  • కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్

న్యూఢిల్లీ, వెలుగు : ఓబీసీ వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ గడువును ఈ ఏడాది జులై 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రం వద్దనున్న ఓబీసీ జాబితాలో వర్గీకరణకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసుకొని జాబితాను పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

రాజ్యసభలో వైఎస్సాఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్త ఆంక్షల కారణంగా నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం కాలపరి మితిని పొడిగించిందని మంత్రి తెలిపారు.
-