ఈనెల 29న ఆచార్య రిలీజ్

ఈనెల 29న ఆచార్య రిలీజ్

చిరంజీవిని, రామ్‌‌ చరణ్‌‌ని కలిపి వెండితెరపై చూడాలన్న మెగా అభిమానుల కోరిక త్వరలో తీరబోతోంది. ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఆచార్య విజువల్స్ చాలా రిచ్‌‌గా ఉన్నాయి. మెగాస్టార్ కొడుకు అయినా చరణ్ హార్డ్ వర్క్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. స్ర్కీన్‌‌ పక్కన ఉన్నది ఆయన కొడుకైనా సరే డామినేట్ చేయాలనుకుంటారు చిరంజీవి. అది మరింత చూడముచ్చటగా ఉంటుంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్న కొరటాల.. ఈసారి మాస్ ట్రీట్‌‌ ఇవ్వడానికి వస్తున్నాడు. ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలని  కోరుకుంటున్నాను’ అన్నారు. రామ్‌‌చరణ్ మాట్లాడుతూ ‘నాన్నగారితో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన కొరటాలకు థ్యాంక్స్. ఇన్నేళ్లలో ఆయన దగ్గర్నుంచి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ..  మారేడుమిల్లిలో వర్క్ చేసిన ఇరవై రోజుల్లో చాలా నేర్చుకున్నా. ‘ఆర్ఆర్ఆర్’ సెట్‌‌ నుంచి ‘ఆచార్య’కు పంపిన రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్. కథలో బలం ఉంటే యాక్టర్స్ ఓవరాక్షన్ చేయాల్సిన పని లేదని కొరటాల శివ నిరూపించారు. ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ నా మనసుకు నచ్చిన సినిమాలు. ఇప్పుడు ‘ఆచార్య’ కూడా నా మనసుకు దగ్గరయింది. ప్రొడక్షన్‌‌ పరంగా అన్నీ  నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలే  చూసుకున్నారు. సినిమాలు కాకుండా బిజినెస్ చేసుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కానీ నేను ఏ ఫీల్డ్‌‌లోకి వెళ్లాలన్నా ఎక్కువ చదువుకోలేదు. మా ఇంట్లో ఉన్న ఆచార్య మాత్రం నాకు చాలా నేర్పించారు. ఆయనకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం’ అన్నాడు. కొరటాల శివ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ఇది. చిరంజీవిని చూస్తే చాలనుకునే దగ్గర్నుంచి ఆయన్ను డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నుంచి నేర్చుకున్నది జీవితకాలం మనసులో నిలిచిపోతుంది’ అని చెప్పారు.  నీలాంబరి లాంటి ఇన్నోసెంట్‌‌ క్యారెక్టర్‌‌‌‌ ఇచ్చిన కొరటాలకి థ్యాంక్స్ చెప్పిన పూజా హెగ్డే.. చిరంజీవి ఎనర్జీ సూపర్‌‌‌‌ అని, రామ్‌‌ చరణ్‌‌తో మరో సినిమా చేయాలని ఉందని అంది. ‘విలువలున్న సినిమాలు తీయడంలో కొరటాల సిద్ధహస్తుడు. స్నేహితుడిగా మాకిచ్చిన మాట కోసం ఇందులో మమ్మల్ని భాగం చేశాడు.  ఈ చిత్రంతో చరణ్ రూపంలో మంచి తమ్ముడు దొరికాడు. ‘ఆర్ఆర్ఆర్’కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది తన పెర్ఫార్మెన్స్. చిరంజీవి గారితో సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా వీళ్లు ఈ సినిమా చేశారు’ అన్నారు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి. చిరంజీవితో నెక్స్ట్ సినిమాలు చేస్తున్న దర్శకులు మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబి, నిర్మాతలు కె.ఎస్.రామారావు, డీవీవీ దానయ్య, రవి శంకర్, ఎన్వీ ప్రసాద్ హాజరై ‘ఆచార్య’ టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. 

చరణ్​కి మార్కులు పడతాయి: చిరంజీవి

 తెలుగు సినిమా హద్దులు చెరిపేసి.. ఇది రీజినల్ సినిమా కాదు, ఇండియన్ సినిమా అని గర్వపడేలా చేసిన రాజమౌళికి హ్యాట్సాఫ్. ‘ఆచార్య’ పూర్తవడానికి కూడా కారణం ఆయనే. శివ అసలు చరణ్‌‌తోనే సినిమా తీద్దామనుకున్నాడు. కానీ అప్పటికే తను ‘ఆర్ఆర్ఆర్‌‌‌‌’తో లాక్ అయిపోవడంతో నేనే చేస్తానన్నా. మళ్లీ కొన్ని రోజులకి రామ్ చరణ్‌‌ పాత్ర అవసరమైంది. రాజమౌళి పర్మిషన్ ఇవ్వడంతో ఇది సాధ్యమయింది. ఈ ప్రీ రిలీజ్‌‌కి ఆయన రావడం ప్రధాన కారణం ఇదే. నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తే చిరంజీవి సినిమా అవుతుంది. కానీ కొరటాల గత చిత్రాలు చూసి.. ఆయనకి ఎలా కావాలంటే అలా పర్‌‌‌‌ఫార్మ్ చేశానంతే. చరణ్, నేను తండ్రీ కొడుకులుగా గానీ, గురు శిష్యులుగా గానీ కనిపించం. చరణ్ క్యారెక్టర్‌‌‌‌కి మంచి మార్కులు పడతాయి. మా స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. మణిశర్మ, నాది అద్భుతమైన కాంబినేషన్. నిరంజన్ రెడ్డి మా కుటుంబ సభ్యుడిలా కలిసిపోయారు. కంటెంట్‌‌లో బలం ఉంటే అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్, డైరెక్టర్సేనని పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ నిరూపించాయి. ప్రతి సినిమాని ఇండియన్ సినిమా అని గొప్పగా చెప్పుకోవాలి.  ప్రతి యాక్టర్‌‌‌‌ ఇండియన్‌‌ యాక్టర్‌‌‌‌నని గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజులు ఇప్పటికే వచ్చాయని నేను నమ్ముతున్నాను.