ఇయ్యాల్టి నుంచి బద్రీనాథ్​ దర్శనం

ఇయ్యాల్టి నుంచి బద్రీనాథ్​ దర్శనం

న్యూఢిల్లీ/డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్​ గుడి తలుపులు ఆదివారం తెరుచుకోనున్నాయి. ఉదయం 6:15 నిమిషాలకు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వర ప్రసాద్​ నంబూద్రి పూజలు నిర్వహించి గుడిని తెరుస్తారు. ఇందుకోసం గుడిని పూలమాలలతో, లైట్లతో అలంకరించారు. సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించున్నట్లు బద్రీనాథ్​ టెంపుల్​అధికారులు తెలిపారు. రోజూ 15 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు చెప్పారు. బద్రీనాథ్​తో కలిపి చార్​దామ్​గా పేర్కొనే యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్​ ఆలయాలు ఇప్పటికే తెరుచుకున్నాయి. అక్షయ తృతియ సందర్భంగా ఈ నెల 3 నుంచే చార్​దామ్​ యాత్ర మొదలైంది.