జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్

జూన్ 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు:  బీటెక్‌, బీఫార్మసీ సెకండియర్​లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్​ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. రెండు విడతల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. జూన్ 8నుంచి 11 వరకూ ఫస్ట్ ఫేజ్  ఆన్​లైన్ రిజిస్ర్టేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. జూన్ 10 నుంచి 12 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. 

జూన్ 18న సీట్ల అలాట్మెంట్ చేయనున్నట్టు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 21లోగా  ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. కాగా.. ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూలై 17, 18 తేదీల్లో జరగనుంది. జూలై 21న సీట్లను అలాట్ చేయనున్నారు.  జూలై 24న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. జూల్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇతర వివరాలకు https://tgecet.nic.in వెబ్ సైట్ పరిశీలంచాలని అధికారులు సూచించారు.